ETV Bharat / crime

Video record while women bathing: మహిళ స్నానం చేస్తుంటే.. ఓనర్​ అబ్బాయి వీడియో రికార్డు..! - secrete camera in trail rooms

Video record while women bathing: మహిళలకు ఇంట్లోనూ భద్రత లేకుండా పోతోంది. సందు దొరికితే చాలు.. కెమెరా కళ్లు కామంతో తెరుచుకుని.. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకు చూస్తున్నాయి. ఇంట్లో అద్దెకున్న మహిళ స్నానం చేస్తుంటే.. యజమాని కొడుకు చేసిన వికృతచేష్టలు వెలుగులోకి వచ్చాయి.

boy secretly recording video of woman bathing in washroom at hyderabad filmnagar

author img

By

Published : Dec 11, 2021, 6:40 PM IST

Video record while women bathing: మహిళల ఆత్మగౌరవానికి భంగం కల్గించే మరో ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. రెస్టారెంట్లు, షాపింగ్​ మాళ్లలో వాష్​రూంలు, ట్రయల్​ రూంలకు వెళ్లాలంటే మహిళలు ఆలోచించాల్సి వస్తున్న ఈ పరిస్థితుల్లో.. ఇళ్లలోనూ రక్షణ కరవవుతోంది. ఎక్కడ ఏ కామపు కెమెరా కన్ను నక్కినక్కి చూస్తోందో తెలియక.. ఆడవాళ్లు అభద్రతాభావానికి గురవుతున్నారు. ఇన్ని రోజులు బయట ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. ఇప్పుడు ఏకంగా ఇంట్లోనూ జరుగుతున్నాయి. హైదరాబాద్ ఫిలింనగర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంట్లోని బాత్​రూంలో..

secretly recording video of woman bathing: ఫిలింనగర్​లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్న మహిళ.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఇంట్లో స్నానం చేస్తుండగా.. ఇంటి యజమాని కొడుకు రహస్యంగా వీడియోలు తీసినట్టు ఫిర్యాదు చేసింది. మూడు నెలలుగా ఇంటియాజమాని కొడుకు దిలీప్‌.. తాను స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్నాడని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అతడి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకువెళ్లినా.. యువకుడికే మద్దతు పలుకుతున్నారని బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

షాపింగ్​మాల్​ ట్రయల్​రూంలో..

secrete camera in trail rooms: షాపింగ్​మాల్‌లో దుస్తులు ట్రయల్​ చేసుకుంటుండగా.. ఇద్దరు పోకిరీలు వీడియో తీసిన ఘటన ఇటీవలే చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్​లోని హెచ్​ఆండ్​ఎం షాపింగ్​మాల్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. మాల్​కి వచ్చిన ఓ యువతి దుస్తులు ట్రయల్​ చేసేందుకు డ్రెస్సింగ్​ రూంలోకి వెళ్లింది. ఇది గమనించిన ఇద్దరు యువకులు.. ఆ యువతి వెళ్లిన గదికి ఆనుకుని ఉన్న మరో డ్రెస్సింగ్​ రూంలోకి వెళ్లారు. పార్టీషన్​ పై నుంచి... యువతి బట్టలు మార్చుకుంటుండగా... చరవాణిలో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చరవాణిని గమనించిన యువతి.. మొదట కేకలు వేసింది.. పూర్తి కథనం కోసం.. ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటుండగా ఫోన్‌లో చిత్రీకరణ.. ఆ తర్వాత..

ఫుడ్​ కోర్టు వాష్​రూంలో..

Camera in Bathroom: అంతకుముందు.. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్-10లోని ఓ ఫుడ్​ కోర్టులోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఫుడ్​ కోర్టుకు వచ్చిన ఓ యువతి వాష్​రూంకి వెళ్లింది. ముందు నుంచే అప్రమత్తత ఉన్న అమ్మాయి కావటం వల్ల.. చుట్టూ పరిశీలించింది. ఎక్కడో కొంత అనుమానం వచ్చి పరిశీలించగా.. అసలు విషయం వెలుగు చూసింది. బాత్​రూమ్‌లోని సెల్​ఫోన్ కెమెరాను గుర్తించిన యువతి.. బయటకు వచ్చి ఆమె స్నేహితులకు ఈ విషయం చెప్పింది. పూర్తి కథనం కోసం.. మహిళల బాత్​రూమ్​లో సెల్​ఫోన్​ కెమెరా.. ఈ ఘనకార్యం ఎవరిదంటే..?

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.