Boy Died in Swimming Pool: సరదాగా అలా ఆడుకుందామని వెళ్లిన తొమ్మిదేళ్ల బాలున్ని స్విమ్మింగ్‌ఫూల్ రూపంలో మృత్యువు మింగేసింది. గృహప్రవేశం కోసం బంధువుల ఇంటికి వచ్చిన వారికి విషాదం మిగిల్చింది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
విజయవాడకు చెందిన విజయ్ కుమార్, పద్మా రాణి దంపతులు నిన్న మధ్యాహ్నం కోకాపేటలోని బంధువుల ఇంటికి గృహ ప్రవేశానికి వచ్చారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్యామ్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ రోజు ఆ బాలుడు అలా ఆడుకుందామని అపార్ట్మెంట్లోని స్విమ్మింగ్‌ఫూల్ వద్దకు వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే వారితో పాటు చేరాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా శ్యామ్ నీటిలో మునిగిపోయాడు. ఎవరూ గమనించక పోవడంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చాలా సేపటికి బాలుడు ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ ప్రాంతమంతా వెతికారు. చివరికి స్విమ్మింగ్‌పూల్ దగ్గరకి వెళ్లగానే అక్కడ కుమారుడు అచేతన స్థితిలో ఉన్నాడు. వెంటనే తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇవీ చదవండి: