Boy Died in Dogs Attack : వీధి కుక్కలు ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాయి. అవి మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురైన బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. హైదరాబాద్ టోలిచౌకి సమతాకాలనీకి చెందిన నజీర్‌పాషా మనవడు మంగళవారం రాత్రి 9.45 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన వీధి కుక్కల గుంపు బాలుడిపై దాడి చేసింది.

Boy Died in Street Dogs Attack : విషయాన్ని గమనించిన స్థానికులు శునకాలను తరిమి చిన్నారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తీవ్రగాయాలకు గురై రక్తపుమడుగులో ఉన్న బాలుణ్ని కుటుంబసభ్యులు గోల్కొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సూచించడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.
ఇవీ చదవండి :