ETV Bharat / crime

గాలిపటం ఎగరేస్తుండగా విద్యుదాఘాతం... బాలుడు మృతి

స్నేహితులతో సరదాగా గాలిపటం ఎగరేస్తున్న ఓ చిన్నారిని విద్యుత్ తీగలు బలితీసుకున్నాయి. తీగలకు చిక్కిన పతంగి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. ఒంటిపై దుస్తులు కాలిపోయి తీవ్రగాయాలతో బాలుడు కొట్టుమిట్టాడడం స్థానికులను కలచివేసింది.

boy-dead-with-electric-shock-while-flying-kite-with-friends-at-electric-shock-while-flying-kite in-nirmal
గాలిపటం ఎగరేస్తుండగా విద్యుదాఘాతం... బాలుడు మృతి
author img

By

Published : Jan 20, 2021, 11:21 AM IST

అప్పటిదాకా ఆనందంగా గాలిపటం ఎగరేసిన ఆ బాలుడు కొద్ది నిమిషాల వ్యవధిలో విద్యుదాఘాతంతో విలవిల్లాడాడాడు. కరెంట్ తీగకు చిక్కిన గాలిపటాన్ని తీసే ప్రయత్నంలో విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్‌ నగర్‌కు చెందిన గంగాధర్, సరిత దంపతుల కుమారుడు అభిలాష్. మిత్రులతో కలిసి సోమవారం నాడు తన ఇంటిపై గాలిపటాన్ని ఎగరవేశారు. ఇంటి సమీపంలోని 33/11 కేవీ విద్యుత్తు లైన్​పై పడిన పతంగిని స్టీలు వైపర్​తో తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. మంటలు చెలరేగి బాలుడి ఒంటిపై దుస్తులు కాలిపోయాయి. పై నుంచి ఇంటి పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్​పై పడ్డాడు.

తీవ్రగాయాలతో బాలుడు కొట్టుమిట్టాడడం స్థానికులను కలిచివేసింది. తమ కళ్లముందే హృదయ విదారక స్థితిలో కన్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు విలవిల్లాడారు. నిజామాబాద్ ఆస్పత్రిలో రెండు రోజులు మృత్యువుతో పోరాడి... మంగళవారం అర్ధరాత్రి బాలుడు మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: పీఎఫ్​ క్లెయిమ్​ కోసం లంచం... సీబీఐకి చిక్కిన అవినీతి అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.