ఏపీలోని కడప జిల్లా కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అసిన్ భాష, భార్య నన్నెమ అనే వృద్ధ దంపతులు ఒకే రోజు మరణించారు. భర్త అసిన్ భాష గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. కొడుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. భర్త పోయిన బాధలో ఉన్న భార్య నన్నెమ కూడా కన్నుమూసింది.
ఒకేరోజు తల్లితండ్రి మృతి చెందడంతో తనయుడు ఖంగుతిన్నాడు. భార్యభర్తలిద్దరు ఒకే రోజు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం