ETV Bharat / crime

బొలేరో వాహనం బోల్తా.. మహిళా కూలీలకు తీవ్రగాయాలు - నాగర్ కర్నూల్​ జిల్లాలో బొలేరో వాహనం బోల్తా

నాగర్ కర్నూల్​ జిల్లా సింగోరం గ్రామ సమీపంలో మామిడి కాయల లోడుతో వెళుతున్న ఓ బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మహిళా కూలీలకు తీవ్రగాయాలవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Bolero vehicle overturns injuring ten women workers in Nagar Kurnool district
బొలేరో వాహనం బోల్తా.. మహిళా కూలీలకు తీవ్రగాయాలు
author img

By

Published : Mar 24, 2021, 1:38 AM IST

మామిడి కాయల లోడుతో వెళుతున్న బొలేరో వాహనం బోల్తా పడిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా సింగోరం గ్రామ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలకు తీవ్రగాయాలవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

జిల్లాలోని పెంట్లవెళ్లి మండలం సింగోరం సమీపంలోని మామిడి తోటలో కాయలు కోయడానికి పానగల్ మండలం కేతపల్లికి చెందిన మహిళా కూలీలు వచ్చారు. కాయలు నింపుకొని తోట నుంచి కాల్వ ఎక్కుతున్న క్రమంలో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది మహిళ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జిల్లా ప్రభుత్య ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, దవాఖానా కమిటీ అధ్యక్షుడు జంబులయ్య పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు.

ఇదీ చదవండి: అనిశా వలకు చిక్కిన ముగ్గురు వీఆర్వోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.