మైనర్ బాలికను అపహరించిన కేసులో రాజు అనే వ్యక్తిని సికింద్రాబాద్లోని బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. హస్మత్ పేట్లో ఆశం రాజు అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమించినట్లు తెలిపారు. బోయిన్ పల్లిలోని హస్మత్ పేట శ్మశానవాటిక వద్ద రాజు పని చేసే వాడని పోలీసులు తెలిపారు. అదే క్రమంలో స్థానిక మైనర్ బాలికకు రాజుకు మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారినట్లు పేర్కొన్నారు. ఈనెల 17న రాత్రి సమయంలో బాలికను తీసుకొని బయటకు వెళ్లిపోయాడు.
బాలిక ఎటు వెళ్లిందో తెలియని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై... రాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకుతున్న సమయంలోనే రాత్రి తమ కుమార్తెను తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు రాజును అరెస్టు చేసి కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాజుకు మైనర్ బాలిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నప్పటికీ... కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అపహరణ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: దారుణం: 4 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి