ETV Bharat / crime

BLAST: భీమవరం సమీపంలో భారీ శబ్దంతో పేలుడు.. ఏం జరిగింది?

author img

By

Published : Aug 14, 2021, 10:31 AM IST

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం - ఉండి మార్గంలోని అనాకోడేరు కాలువ సమీపంలో ఖాళీ స్థలంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

BLAST
భారీ శబ్దంతో పేలుడు

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం - ఉండి రోడ్డులోని అనాకోడేరు కాలువ సమీపంలోని ఖాళీ స్థలంలో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అనాకోడేరు కాలువ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... ఆ ప్రాంతంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఒక్కసారిగా సంభవించిన పేలుడుకు స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతంలో గడ్డి మేస్తున్న ఆవు తీవ్రంగా గాయపడింది. నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

జగన్ పర్యటన నేపథ్యంలో అలర్ట్..

భీమవరంలోని శనివారం జరిగే ఓ వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్​ హాజరుకానున్నారు. ఈ తరుణంలో పేలుడు సంభవించడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పేలుడుకు గల కారణాల గురించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: FISHERMEN MISSING: శ్రీకాకుళం సముద్ర తీరంలో ముగ్గురు జాలర్లు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.