ETV Bharat / crime

అమ్మాయి అందంగా ఉందని బండి ఆపారా.. ఇక అంతే సంగతులు - extorting money Gang arrested in Guntur

Lady Gang Arrest: అసలే అమ్మాయి.. రోడ్డు మీద జీన్స్ పాయింట్, టీ షర్ట్ వేసుకుని లిఫ్ట్​ కోసం వాహనం ఆపితే ఎవరైనా ఏం చేస్తారు..? ఠక్కున బండి ఆపేస్తారు కదా.. అంతే వాళ్లు మీ దగ్గరకు వచ్చి చిన్నారికి ఆరోగ్యం బాగాలేదని ఒకరు.. స్వచ్ఛంద సంస్థ పేరు చెప్పి మరొకరు.. కథలు చెప్తారు. పైసలియ్యకపోతే.. ఏదైనా చేయొచ్చు. దీంతో వాహనదారులు భయపడి తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి వసూళ్లకు పాల్పడుతున్న 32 సభ్యుల కి'లేడి' ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

అమ్మాయి అందంగా ఉందని బండి ఆపారా.. ఇక అంతే సంగతులు

author img

By

Published : May 19, 2022, 5:31 AM IST

Lady Gang Arrest: ఏపీలోని గుంటూరు జిల్లాలో వాహనదారుల నుంచి డబ్బు గుంజుతున్న గుజరాత్‌ మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠాలో మొత్తం 32 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గంతో పాటు పెదకాకాని హైవే తదితర ప్రాంతాల్లో వాహనదారులను బెదిరించి డబ్బు గుంజుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు నాలుగైదు బృందాలుగా ఏర్పడి మొత్తం 18 మందిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

పెదకాకాని పరిధిలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ బండారు సురేశ్‌బాబు తెలిపారు. 'గుజరాత్‌లోని దుర్గానగర్‌కు చెందిన ఐదుగురు యువతులు గుంటూరు సమీపంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. తమది గుజరాత్‌ అని.. ప్రకృతి వైపరీత్యాలతో తమ గ్రామం లేకుండా పోయిందంటూ కరపత్రాలను చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాహనదారుల నుంచి వాహనాల తాళాలు లాక్కొని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కేసు పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. గుంటూరుకు చెందిన సాయితేజరెడ్డి అనే వాహనదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో సదరు యువతులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశాం' అని సీఐ సురేశ్​ బాబు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.