ETV Bharat / crime

బైక్​ల చోరీ గ్యాంగ్​ అరెస్టు

పలువురు సభ్యులు ముఠాగా చేరారు. పార్కింగ్​ చేసిన బైక్​లనే లక్ష్యంగా చేసుకుని దోచుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ పట్టణంలో 15కు పైగా ద్విచక్రవాహనాలు పోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబ్​నగర్​లో జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సభ్యులను పట్టుకున్నారు.

Bike theft gang arrested at mahabubnagar
బైక్​ల చోరీ గ్యాంగ్​ అరెస్టు
author img

By

Published : Feb 27, 2021, 4:15 PM IST

మహబూబ్​నగర్​లో బైక్​ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్​నగర్ పట్టణంలో గత రెండు నెలల నుంచి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్కింగ్​ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన బైక్​లనే వారు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ ఉండేవారని పోలీసులు పేర్కొన్నారు. వారి దగ్గర ఎక్కువ సంఖ్యలో వివిధ రకాల బైక్​లు ఉన్నట్లు సమాచారం రావడంతో విచారణ చేపట్టామని... దీంతో చోరీ వ్యవహారం బయటపడిందని పోలీసులు వెల్లడించారు.

ఆ మూఠా 15 మోటర్ సైకిళ్లను దొంగలించగా.. 8 లక్షల విలువైన 14 మోటార్ సైకిళ్లను, మరో బైక్​కు సంబంధించి 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన బైక్​లను తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యక్తులపై కూడా.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. పరారీలో ఉన్న వారిని సైతం పట్టుకుని రిమాండుకు తరలిస్తామన్నారు.

ఇదీ చూడండి: నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.