ETV Bharat / crime

మ‌హిళ‌ను ఢీకొట్టిన బైక్ ‌రైడ‌ర్‌.. చికిత్స పొందుతూ మృతి - telangana varthalu

మద్యం సేవించి ఓ వ్యక్తి వాహనం నడపడం వల్ల ఓ అమాయక మహిళ ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు దాటుతున్న మహిళను మద్యం మత్తులో ఓ ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టిన ఘటన హైదరాబాద్​లోని మాదాపూర్​లో జరిగింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.

bike rider hits woman
మ‌హిళ‌ను ఢీకొట్టిన బైక్ ‌రైడ‌ర్
author img

By

Published : Mar 31, 2021, 10:28 PM IST

మ‌ద్యం మ‌త్తులో వాహ‌నం న‌డిపిన ఓ యువ‌కుడు రోడ్డు దాటుతున్న ఓ మ‌‌హిళను ఢీకొట్టి ఆమె మృతికి కార‌ణ‌మ‌య్యాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని మాదాపూర్​లో జరిగింది. విశాఖ‌ప‌ట్టణానికి చెందిన బి.ర‌విప్ర‌కాష్ 15 రోజుల క్రితం న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చి డీజే ఆపరేటర్​గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. కాగా సోమ‌వారం సాయంత్రం మ‌ద్యం సేవించిన ర‌విప్ర‌కాష్ ద్విచక్రవాహనంపై కేపీహెచ్‌‌బీ నుంచి మాదాపూర్ అయ్య‌ప్ప‌సొసైటీ వైపు వ‌స్తున్నాడు. అదే స‌మ‌యంలో ర‌త్నావ‌త్ క‌విత‌(29) హౌస్‌కీపింగ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు మాదాపూర్​లోని కార్వీ ఆఫీస్ ఎదుట రోడ్డు దాటుతుండగా... మ‌ద్యం మ‌త్తులో బైక్‌పై వేగంగా వ‌స్తున్న ర‌విప్ర‌కాష్ ఆమెను ఢీకొట్ట‌డంతో తీవ్ర గాయాలపాలైంది.

ఆమెను చికిత్స నిమిత్తం పేస్ హాస్పిట‌ల్ త‌ర‌లించ‌గా... చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు ర‌విప్ర‌కాష్‌కు బ్రీత్ అన‌లైజ్ ప‌రీక్ష‌లు చేయ‌గా.. అతనికి 267 ఎంజీ/100ఎంఎల్​ రీడింగ్ వచ్చిందని మాదాపూర్​ సీఐ రవీంద్రప్రసాద్​ తెలిపారు. రవిప్రకాష్​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.

మ‌హిళ‌ను ఢీకొట్టిన బైక్ ‌రైడ‌ర్‌.. చికిత్స పొందుతూ మృతి

ఇదీ చదవండి: అడ్డు వస్తున్నాడని పసివాడి ప్రాణాలు తీశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.