ETV Bharat / crime

బైక్ కింద పడి ఆరేళ్ల బాలుడు మృతి - ఆరేళ్ల బాలుడు మృతి

ఓ దంపతులు అత్తారింటికి బైక్​పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం కింద పడింది. ఘటనలో ఓ ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.

nagarkurnool accident news, Bike falls Six year old boy died
కింద పడిన బైక్​.. ఆరేళ్ల బాలుడు మృతి
author img

By

Published : Apr 9, 2021, 9:16 AM IST

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బైక్​ కింద పడిన ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. జిల్లాలోని ఉప్పునుంతలకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, శ్రీదేవి దంపతులకు కుమార్తె హరిణి(7), ఓ చిన్న కుమారుడు ఉన్నారు.

శ్రీనివాస్ రెడ్డి ఉప్పరిపల్లిలో ఉన్న తన అత్తారింటికి భార్యా పిల్లలను తీసుకుని బయలు దేరారు. ఈ క్రమంలో ఉప్పరిపల్లి మలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడింది. ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అల్లారు ముద్దుగా ఆడుకునే బాబు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇదీ చూడండి : రుణాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు వసూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.