రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. అరంగల్ చౌరస్తా సమీపంలో ఈ ఘటన జరిగింది. స్కూటీపై వెళ్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో… వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని… పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతుడు నందిగామకు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు చిక్కిన చైన్స్నాచర్లు