రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ప్రైవేట్ ఆస్పత్రులకు అధిక ధరలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్న ప్రభుత్వ వైద్యులను వైద్యవిధాన పరిషత్ అధికారులు సస్పెండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారనే వివాదంలో భాగంగా వారిపై కేసు నమోదైంది.
ఏప్రిల్ 29న ఆస్పత్రి వైద్యుడు కృష్ణ ప్రసాద్, సూపరింటెండెంట్ యుగంధర్, ఫార్మాసిస్ట్ శ్రీనివాసులుపై భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజం కావడంతో వారిపై కేసు నమోదు చేశారు. కృష్ణ ప్రసాద్‌ను అరెస్ట్ చేయగా, మిగిలిన ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: టిమ్స్‌కు క్యూ కడుతున్న కొవిడ్ రోగులు.. అందుబాటులో లేని సేవలు