ETV Bharat / crime

లేలేత ప్రాయంలో మత్తుకు బానిసై.. వైట్​నర్​ సేవిస్తున్న చిన్నారులు - kids addicted to whitener

Children are consuming whitener: రాజధాని నగరంలో 'మత్తు' పెడుతున్న కలవరం అంతా ఇంతా కాదు. గత కొన్ని రోజులుగా పబ్​లు, పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన డ్రగ్స్​, గంజాయే ఇందుకు నిదర్శనం. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన యువత.. మాదకద్రవ్యాలకు బానిసవుతూ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. అసలు మత్తు అంటే ఏంటో తెలియని ప్రాయంలో ఉన్న చిన్నారులు సైతం.. ఆ నిషాను తలకెక్కించుకోవాలనుకుంటున్నారు. నిండా పదేళ్లు కూడా లేని కొందరు చిన్నారులు నగరంలో ఓ చోట వైట్​నర్​ సేవిస్తూ కంటపడటం.. ఆందోళనకు గురిచేస్తోంది.

children take whitener
వైట్​నర్​ తాగుతున్న చిన్నారులు
author img

By

Published : Apr 9, 2022, 1:17 PM IST

మత్తుకు బానిస అవుతున్న బాల్యం

Children are consuming whitener: భాగ్యనగరంలో ఇటీవల వెలుగులోకి వస్తున్న మాదకద్రవ్యాల ఘటనలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మత్తుమైకంలో యువత జీవితాలు నాశనం చేసుకుంటుండగా.. ధనార్జనే లక్ష్యంగా కొందరు వీటిని సరఫరా చేస్తూ సమాజాన్ని చీడలా పట్టిపీడిస్తున్నారు. ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి దాటాక బంజారాహిల్స్​లోని పబ్​లో వివిధ రకాల డ్రగ్స్​ పట్టుబడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అంతే కాకుండా నగరం నలువైపులా రహదారులపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి దొరకడం.. రాష్ట్రాన్ని మత్తు ఎలా పట్టిపీడుస్తోందో అర్థమవుతోంది.

పెడదారి పట్టి: బీటెక్​ చదివిన ఓ యువకుడు డ్రగ్స్​కు బానిసై.. చివరికి డబ్బు కోసం ఆ డ్రగ్​నే తయారు చేయడం నేర్చుకున్నాడు. ఒక్కగ్రామ్​తో 20 మందికి కిక్కిచ్చేలా దాన్ని రూపొందించాడు. వ్యక్తిగతంగా, సమాజానికి ఉపయోగపడేలా తన ప్రతిభను ఉపయోగించాల్సిన ఈ యువకుడు.. మత్తు తయారీకి వినియోగించి చివరకు కటకటాలపాలయ్యాడు. ఉన్నతాధికారుల పిల్లలు సైతం ఈ వ్యాపారంలో ఉన్నారంటే.. యువతపై డ్రగ్స్​ ప్రభావం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు.

నషా ఎక్కుతుందని: ఇదిలా ఉంటే... కొందరు చిన్నారులు సైతం ఈ దారులను వెతుకుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్​ విజయనగర్​ కాలనీలో కొందరు చిన్నారులు ఒకచోట చేరి.. వైట్​నర్​ సేవిస్తుండటం కలకలంరేపింది. నిండా పదేళ్లయినా లేని ఈ పిల్లలు గుంపులుగా చేరి మద్యం, వైట్​నర్​ సేవిస్తున్నారు. ఈ పిల్లల వద్దకు వెళ్లి.. ఏమిటదని ప్రశ్నించగా వైట్​నర్​ అంటూ ఏ మాత్రం జంకులేకుండా సమాధానం చెప్పారు. ఎక్కడ నుంచి కొనుగోలు చేశారని ప్రశ్నించగా.. మల్లేపల్లి, ఆసీఫ్​నగర్, గోషామహల్ ప్రాంతాల్లో ఇది దొరుకుతుందని పేర్కొన్నారు. ఇది తాగితే ఏవుతుందని అడగ్గా.. నషా ఎక్కుతుందని బదులిచ్చారు.

పోలీసుల కంటపడటం లేదా?: లేలేత ప్రాయంలో అదీ బహిరంగ ప్రదేశంలో వీరంతా వైట్​నర్​ సేవిస్తుండటాన్ని చూసి స్థానికులు షాక్​కు గురయ్యారు. కాలనీలో ఇంత జరుగుతున్నా పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఇది కంటపడటం లేదా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు ఇలాంటి వాటి పైన దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా లాక్​డౌన్​ సమయంలోనూ మద్యానికి అలవాటైన కొందరు రోడ్డు పక్కన పడి ఉన్న శానిటైజర్​, మత్తు కోసం వైట్​నర్​ సేవించిన ఘటనలో వార్తల్లోకెక్కిన ఘటనలో ఆందోళనకు గురిచేశాయి.

ఇదీ చదవండి: హాష్‌ ఆయిల్‌ : మత్తు కాదు.. అంతకుమించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.