రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి దాడి గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎలుగు దాడిలో రుద్రంగి మండలంలోని దేగావత్ తండా చెందిన కున్సోతు గంగాధర్ (50)తీవ్ర గాయాలపాలయ్యారు. గంగాధర్ ఆవుల మందను కాస్తూ ఉంటారు. మంగళవారం మానాల అడవిలో తప్పిపోయిన ఆవులను వెతికే క్రమంలో అతను ఎలుగుబంటి దాడికి గురయ్యారు. ఘటనలో గంగాధర్ తల, కళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.
దాడి సమయంలో బాధితుడి అరుపులతో సమీపంలో ఉన్న రైతులు ఘటనాస్థలికి చేరుకుని గంగాధర్‌ను రక్షించారు. క్షతగాత్రుడిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: Government hospitals: పేదల ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు.. ఇవిగో సాక్ష్యాలు