రంగారెడ్డి జిల్లా దండుమైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో ఉరేసుకుని బ్యాంకు ఉద్యోగి మక్బూల్ బలవన్మరణం చెందారు.

మక్భూల్ మృతికి సహకార సంఘం ఛైర్మన్ బూట్ల వెంకటరెడ్డి వేధింపులే కారణమని గ్రామస్థులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వెంటనే అతనిని సస్పెండ్ చేయాలని... బ్యాంకు ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదం... 11 మందికి గాయాలు