ETV Bharat / crime

Murder: వెనక కూర్చొని.. బండి నడుపుతున్న వ్యక్తి గొంతు కోసేశాడు.! - గొంతు కోసి హత్య

ప్రేమ పేరుతో కూతురిని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పద్ధతి మార్చుకోకుండా.. ఫోన్లు చేసి విసిగించసాగాడు. కోపం పెంచుకున్న తండ్రి ఆ వ్యక్తిని హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. దానికి ఓ ప్లాన్​ వేశాడు. అనుకున్న ప్రకారం.. అందరూ చూస్తుండగానే ప్లాన్​ అమలు చేసి హతమార్చాడు. ఈ హత్య దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డయ్యాయి.

back seat man cut bike rider throat at old city falaknuma

author img

By

Published : Jun 6, 2021, 8:46 PM IST

వెనక కూర్చొని.. బండి నడుపుతున్న వ్యక్తి గొంతు కోసేశాడు.!

హైదరాబాద్​ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనదారున్ని వెనుక కూర్చున్న వ్యక్తి... గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఫలక్​నుమా బస్​డిపో సమీపంలో జరిగింది. జనసంచారం ఉన్న వీధిలో నుంచి గొంతులో నుంచి రక్తం చిమ్ముతున్న ఓ వాహనదారుడు పరుగెత్తుతూ వచ్చి రోడ్డుపై కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న ఫలక్​నుమా సీఐ దేవేందర్... సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. క్లూస్​ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడు అన్సారీ రోడ్​కు చెందిన షారూఫ్​గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఫలక్​నుమా ఏసీపీ ఎంఏ మాజిద్ సందర్శించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్య చేసింది... సయ్యద్ అన్వర్​గా పోలీసులు గుర్తించారు.

కూతురిని వేధిస్తున్నాడనే...

గతేడాది షారూఫ్​పై నిందితుడు సయ్యద్ అన్వర్ కేసుపెట్టాడు. తన కూతురిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా... పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటికీ షారూఫ్​.. పద్ధతి మార్చుకోకుండా అన్వర్​కు పదే పదే ఫోన్లు చేసి వేధించసాగాడు. ధ్వేషం పెంచుకున్న సయ్యద్ అన్వర్... ప్లాన్​ ప్రకారం మృతుడు షారూఫ్​ను పిలిచాడు. షాఅలీ బండ వరకు వెల్దామన్నాడు. ఒప్పుకున్న షారూఫ్​... తన ద్విచక్రవాహనంపై తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో వెనకాల కూర్చున్న సయ్యద్...​ ద్విచక్రవాహనం నడుపుతున్న షారూఫ్​ను గొంతు కోసి పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఇదీ చూడండి: Lady Fraud: మాయమాటలతో మొబైల్​​ షాప్​ఓనర్​ దగ్గర రూ.80 లక్షలు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.