జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ అని నమ్మించి 11 కోట్లు వసూలు చేసిన ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో వెలుగుచూసింది. విలాసాలకు అలవాటు పడిన మహిళ స్మృతి సిన్హా బంధువులతో కలిసి వీరారెడ్డి అనే వ్యక్తి వద్ద భారీగా నగదు కాజేసింది.
తన చెల్లిని వీరారెడ్డికి ఇచ్చి పెళ్లిచేస్తానని... తనకు భారీగా ఆస్తులున్నాయని నమ్మించింది. తన బంధువు విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి వసూళ్లకు పాల్పడి ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోసపోయానని గ్రహించిన వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్మృతి బంధువు విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కేసులో స్మృతి సిన్హాకు సహకరించిన మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. 72 వోల్వో బస్సులు, బాచుపల్లిలో 32 ఎకరాల పార్కింగ్ స్థలం ఉందని చెప్పి వీరారెడ్డి నుంచి డబ్బులు వసూలు చేశారు. వీరి నుంచి 3 కార్లు, 6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.