ETV Bharat / crime

స్టాక్ మార్కెట్ పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ భారీ మోసం - తెలంగాణ తాజా వార్తలు

stock market
stock market
author img

By

Published : Sep 27, 2021, 6:39 PM IST

Updated : Sep 27, 2021, 9:10 PM IST

18:32 September 27

స్టాక్ మార్కెట్ పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ భారీ మోసం

 అధికవడ్డీ ఆశతో చాలామంది ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ప్రజల్లోని ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు గాలం వేస్తున్నారు. చిక్కుకున్నవారి నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్​లో వెలుగులోకి వచ్చింది.   

 తనతో స్టాక్ మార్కెట్​లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తానని పలువురిని మోసం చేసిన రావిప్రోలు శ్రీ హర్షను హైదరాబాద్ సీసీఎస్​ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ పలువురి నుంచి రూ.17కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో యూఏఈలోని అబుదాబిలో యాక్సిస్ బ్యాంకులో శ్రీహర్ష పని చేసినట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్​కి చెందిన బాధితుడు రవిశంకర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 

 పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన శ్రీహర్ష 2019 సెప్టెంబర్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. పంజాబ్ మొహాలిలోని ఖరార్​లో శ్రీహర్ష తలదాచుకున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు... నిందితుడు శ్రీహర్షని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: gold smuggling in hyderabad airport: చాక్లెట్ డబ్బాలో బంగారం.. భారీ మొత్తంలో సీజ్

Last Updated : Sep 27, 2021, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.