ETV Bharat / crime

ఆటో అదుపుతప్పింది.. భవిష్యత్తుపై గుబులు మొదలైంది.. - కరీంనగర్ తాజా నేర వార్తలు

ఆ విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష కేంద్రానికి ఆటోలో బయలుదేరారు. కాసేపు మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. విద్యార్థుల భవిష్యత్​ను అంధకారంలోకి నెట్టేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటుచేసుకుంది.

Wounded in accident
ప్రమాదంలో క్షతగాత్రులు
author img

By

Published : Mar 19, 2022, 7:13 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన విద్యార్థులు డిగ్రీ వార్షిక పరీక్షల కోసం జిల్లా కేంద్రంకు ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ పోచమ్మ దేవాలయ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని గాయపడిన విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

108 staff providing treatment
చికిత్స అందిస్తున్న 108 సిబ్బంది

చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవి శంకర్​లు పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఓ వైపు గాయాలు.. మరోవైపు భవిష్యత్‌పై అస్పష్టతతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.

Minister Gangula addressed the students
విద్యార్థులను పరామర్శించిన మంత్రి గంగుల

ఇదీ చదవండి: పెళ్లి కావడం లేదని భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.