రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఐఆర్డీ కమాన్ వద్ద ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. బాలరాజు తన వద్ద ఉన్న కొడవలితో రమేశ్ అనే వ్యక్తి మెడ, చేతులపై దాడి చేశాడు. ఈ ఘటనలో రమేశ్ పరిస్థితి విషమించింది.
పోలీసులు క్లూస్ టీం సాయంతో దాడికి ఉపయోగించిన కొడవలి, కర్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలరాజును అదుపులోకి తీసుకొని.. రమేశ్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరి మధ్య పశువులకు వేసే గడ్డి విషయంలో గతంలో ఘర్షణలు జరిగాయని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీ వాసులేనని.. బాలరాజు గతంలో పలు మార్లు జైలుకి వెళ్లి వచ్చాడని ఏసీపీ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 2013లో జంటహత్య కేసులోనూ జైలుకు వెళ్లాడన్నారు.
ఇదీ చూడండి: వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ప్రేమ విఫలమే కారణం!