ETV Bharat / crime

CRIME: తల్లిని కొట్టాడని.. మేనమామపై కత్తితో దాడి - తెలంగాణ నేరవార్తలు

తల్లిపై చేయిచేసుకున్నాడని.. మేనమామపై అల్లుళ్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగానే.. కత్తితో దాడి చేశారు.

attack on uncle at mahabubabad
attack on uncle at mahabubabad
author img

By

Published : Aug 13, 2021, 7:44 PM IST

Updated : Aug 14, 2021, 9:28 AM IST

తల్లిని కొట్టాడనే కారణంతో మేనమామపై అల్లుళ్లు దాడి చేశారు. కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో జరిగింది.

అసలేం జరిగింది..

ఉప్పరపల్లిలో వారం క్రితం ప్రభాకర్​ అనే వ్యక్తి.. మద్యం మత్తులో తన అక్క భారతమ్మపై చేయిచేసుకున్నాడు. ఇదే విషయాన్ని హైదరాబాద్​లో ఉంటున్న ఆమె తన కుమారులు రమేశ్​, సంపత్​లకు చెప్పింది. ఆగ్రహించిన వారు.. హైదరాబాద్​ నుంచి వచ్చి.. మేనమామ ప్రభాకర్​ను పంచాయితీకి పిలిపించారు. గ్రామపెద్దల సమక్షంలో విచారణ జరుగుతోంది. ఆ సమయంలో మాటామాటా పెరిగింది. అది కాస్త మేనమామ, అల్లుళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మామపై కత్తితో విచక్షణరహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ప్రభాకర్​కు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు చికిత్స కోసం వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి: 'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు

Last Updated : Aug 14, 2021, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.