ETV Bharat / crime

ఫుడ్​ ఆర్డర్​ లేట్​ అయిందని... డెలివరీ బాయ్‌పై దాడి - హైదరాబాద్ తాజా వార్తలు

Attack on food delivery boy: హైదరాబాద్ హుమాయున్‌నగర్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆర్డర్‌ ఆలస్యం అయిందని ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితుడితో పాటు మరో ముగ్గురిపై వేడినూనె పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

Attack on food delivery boy
Attack on food delivery boy
author img

By

Published : Jan 3, 2023, 11:22 AM IST

Updated : Jan 3, 2023, 3:14 PM IST

Attack on food delivery boy: హైదరాబాద్‌ నగరంలోని హుమాయున్‌నగర్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆర్డర్‌ లేట్ అయిందని, ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై విచక్షణరహితంగా దాడికి దిగాడు. తన 15 మంది అనుచరులతో కలిసి వచ్చి ఓ హోటల్‌ వద్ద భయానక వాతవరణం సృష్టించాడు. భయంతో సదరు ఫుడ్‌ డెలివరీ బాయ్‌ హోటల్‌లోకి పరుగులు తీయగా, వారు సైతం హోటల్‌లోకి దూసుకెళ్లి మరీ బాధితుడిపై దాడి చేశారు. ఈ క్రమంలో మరిగే నూనె మీద పడడంతో ఫుడ్‌ డెలివరీ బాయ్‌తో పాటు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఫుడ్ డెలివరీ బాయ్​కి అహ్మద్ అనే వ్యక్తికి పార్కింగ్ వద్ద చిన్నపాటి గొడవ జరిగింది. డెలివరీ బాయ్​పై అహ్మద్, అతని కుమారులు దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో 555 హోటల్ కిచెన్​లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు సరదాగా తోసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి కాళ్లు జారి పక్కనే ఉన్న నూనె కలాయి పడడం.. ఆ నూనె అక్కడే ఉన్న మరో ఇద్దరిపై చిల్లడం వల్ల వారు గాయాల పాలయ్యారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పోలీసులు తెలిపారు. గొడవకు సంబంధించి అన్ని సీసీ ఫుటేజ్​లు పరిశీలించాకే రెండు కేసులు నమోదు చేశామన్నారు. డెలివరీ బాయ్​పైన దాడి చేసిన అహ్మద్, అతని కుమారులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 3, 2023, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.