మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆందోల్ మండలం మాసానిపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది.
ఇదే గ్రామానికి చెందిన సుగుణమ్మ బాణామతి చేయించడం వల్లే మల్లమ్మ చనిపోయిందని భావించిన మృతురాలి బంధువులు, గ్రామస్థులు ఆమె కుటుంబంపై దాడి చేశారు. తమను కాపాడాలని బాధితులు జోగిపేట పోలీసులను ఆశ్రయించారు.
- ఇదీ చదవండి: ఆ విషయంలో అస్సలు రాజీపడట్లేదు: శ్రుతి