ETV Bharat / crime

ఏటీఎంలో సాంకేతికత లోపం గుర్తించి.. దాదాపు రూ.10 లక్షల చోరీ!

ATM THEFT GANG ARREST: సాంకేతికత రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఎటువంటి తప్పులు జరగకుండా అధికారులు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. కానీ అందులో చిన్న తప్పిదం జరిగినా అది దొంగల పాలిట వరంగా మారుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ విశాఖలోని బ్యాంకు ఏటీఎంలో చిన్నపాటి సాంకేతిక లోపాన్ని గమనించిన దొంగలు ఏకంగా రూ.9లక్షల 49వేల నగదును దోచుకున్నారు. తీరా సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా దొరికిపోయి, అరెస్టు అయ్యారు.

ATM THEFT GANG ARREST
ఆంధ్రప్రదేశ్​లో ఏటీఎం చోరీ
author img

By

Published : Dec 14, 2022, 3:39 PM IST

ATM THEFT GANG ARREST: చిన్నపాటి సాంకేతిక లోపాన్ని గమనించి విశాఖలోని బ్యాంకు ఏటీఎంల నుంచి దొంగలు రూ.9లక్షల 49వేల రూపాయలను దోచేశారు. మొత్తం ముగ్గురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు. నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌ భరార్‌పుర్‌ ప్రాంతానికి చెందిన షారూక్‌ 2017 నుంచి విశాఖలో చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడు గత నెల 30న అదే రాష్ట్రానికి చెందిన రషీద్‌(24), ముస్తకీమ్‌(21), సాయికూల్‌(25)తో కలిసి నగరానికి విమానంలో వచ్చి ఓ లాడ్జిలో బస చేశారు.

ఎలా చేశారు: వీరంతా తమ ప్రాంతానికే చెందిన కొందరితో కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్‌ బ్యాంకులో ఖాతాలు తెరిపించి డెబిట్‌ కార్డులను తమ వద్దే ఉంచుకున్నారు. వారితో కొంత నగదు అకౌంట్లలో వేయించి.. తర్వాత తమ చోరీ ప్రణాళిక అమలు చేస్తారు. ముందుగా ఆ బ్యాంకు అనకాపల్లి బ్రాంచి ఏటీఎంలో వారు తమ పథకాన్ని అమలు చేశారు. నగదు విత్‌డ్రాకు కార్డు పెట్టిన తర్వాత డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం యంత్రం పవర్‌ బటన్‌ను ఆపేసి వెంటనే ఆన్‌ చేస్తారు.

ఆ సమయంలో ఏటీఎం నుంచి నోట్లు బయటకు వచ్చినా.. అవి క్యాసెట్‌ మధ్యలో ఉండగానే పవర్‌ ఆపేయడం వల్ల లావాదేవీని తప్పుగా చూపుతుంది. సంబంధిత ఖాతాదారుకు నగదు విత్‌ డ్రా అయినట్లు సమాచారం వెళ్లినా వెంటనే తిరిగి ఆ మొత్తం జమ అయినట్లు సంక్షిప్త సందేశం కూడా వెళ్తుంది. ఈలోగా వారు క్యాసెట్‌ మధ్యలో ఉండిపోయిన నోట్లను లాగేస్తారు. ఇలా వేర్వేరు ఏటీఎంల నుంచి ఈనెల 2-5 తేదీల మధ్య 95 సార్లు సొమ్ము విత్‌డ్రా చేశారు.

రోజువారీ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు ఈనెల 12న పోలీసులను ఆశ్రయించారు. వారు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు షారూక్‌ పరారీలో ఉండడంతో మిగిలిన వారిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.6లక్షల 91వేల రూపాయల నగదు, 78 ఏటీఎం కార్డులు, విమాన టిక్కెట్‌, ఓ ద్విచక్రవాహనం, 12 కిలోల గంజాయి, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ వివరించారు. సకాలంలో ఈ కేసును ఛేదించిన ఏసీపీ నర్సింహమూర్తి బృందాన్ని ఆయన అభినందించారు. క్రైమ్‌ డీసీపీ నాగన్న, ఏడీసీపీ గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.