ETV Bharat / crime

acb arrest: లంచం అడిగారు.. అనిశాకు చిక్కారు - jookal chityal

ప్రజా ప్రనుల్లో అధికారుల తీరు మారడం లేదు. తాజాగా భూమి కొలత కోసం ఓ వ్యక్తి ప్రభుత్వ అధికారులను సంప్రదించగా.. వారు డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఏం చేయాలో అర్థం కాని బాధితుడు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అనిశా.. డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్​(acb arrest)గా పట్టుకుంది. ఏసీబీ అధికారులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో చోటుచేసుకుంది.

mro arrest, acb rides, acb caught mro red handed, zonal surveyor
లంచం, ఏసీబీ అధికారులు, అనిశా, మండల సర్వేయర్ అరెస్టు, ఏసీబీ వలలో మండల సర్వేయర్
author img

By

Published : Jun 26, 2021, 8:39 AM IST

భూమి కొలత కోసం డబ్బులు డిమాండ్ చేసి ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ అధికారులకు(acb arrest) చిక్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్​కి చెందిన రావుల శ్రవణ్ తన భూమిని కొలవాలని.. చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

భూమి కొలవాలంటే.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు మండల సర్వేయర్ పావని. ఆ దరఖాస్తును భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ ఇన్​స్పెక్టర్ రాములుకు పంపారు. అతను కూడా డబ్బులు కావాలని కోరాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

హన్మకొండలోని కొమిటిపల్లిలో ఉంటున్న డిప్యూటీ ఇన్​స్పెక్టర్ రాములు ఇంటికి బాధితుడు డబ్బులు తీసుకుని వెళ్లాడు. అధికారి రాములు రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం చిట్యాల మండల సర్వేయర్ పావనిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లిలోని అనిశా కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. పలు వివరాల కోసం చిట్యాల మండల ఆఫీసు, పరకాలలోని అధికారి పావని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.