ETV Bharat / crime

asi dead: పెళ్లింట విషాదం.. తల్లి మరణవార్త విని ఏఎస్సై హఠాన్మరణం! - ap news

ఏపీలోని అనంతపురం జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహం పూర్తయిన కాసేపటికే వరుడి నానమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ వార్తవిని ఆమె కుమారుడూ కుప్పకూలిపోయాడు(ASI Venkataswamy died). హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

asi dead
asi dead
author img

By

Published : Nov 7, 2021, 9:31 AM IST

తల్లి మరణ వార్త విన్న కుమారుడు హఠాత్తుగా కుప్పకూలిపోయారు. పరీక్షించిన వైద్యులు.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు(ASI Venkataswamy died). ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్‌ వివాహం జరిపించారు.

మరోవైపు వెంకటస్వామి తల్లి కోన్నమ్మ(70) అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చేరి మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. తల్లి ఆరోగ్యం గురించి దిగులుపడుతూనే ఆయన కుమారుడి వివాహాన్ని జరిపించారు. పెళ్లి తంతు ముగిసిన కాసేపటికే కోన్నమ్మ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని బంధువులు ఫోన్‌లో వెంకటస్వామికి చెప్పడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.

ఇదీ చదవండి: youth commits suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏం రాశాడంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.