ETV Bharat / crime

Cannabis: మంగళ్​హాట్​ స్పాట్ కానీ రహ్మత్​నగర్​లో దొరికిపోయిన గంజాయి ముఠా

author img

By

Published : Oct 28, 2021, 10:49 PM IST

తెలంగాణలో గంజాయి విక్రయాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ మేరకు అనుమానాస్పద ప్రాంతాల్లో నిరంతరం సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇవాళ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Cannabis
Cannabis

ఏపీ విశాఖ జిల్లా సీలేరు నుంచి ఆటోలో గంజాయి తీసుకొచ్చి జూబ్లీహిల్స్ రహ్మత్ నగర్​లో ఉంచిన ఇద్దరు నిందితులను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 70కిలోల గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎస్సార్ నగర్​కు చెందిన నర్సింగ్ సింగ్, రమేశ్​లు కలిసి సీలేరు నుంచి ఈనెల 17న ఆటోలో గంజాయి తీసుకొచ్చారు.

మంగళ్ హాట్​లో విక్రయించాల్సి ఉండగా... పోలీసుల నిఘా పెరగడం వల్ల జూబ్లీహిల్స్​లోని రహ్మత్ నగర్​లో ఓ గదిలో ఉంచారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నర్సింగ్, రమేశ్​లపై గతంలోనూ కేసులున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగరంలో గంజాయి విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • NABBED TWO GANJA PEDDLERS – SEIZED (70) KGS GANJA AND (1) AUTO FROM THEIR POSSESSION
    On 28-10-2021 the sleuths of Commissioner’s Task Force, West Zone team apprehended two persons by name 1) Narsing Singh and 2) Ramavath Ramesh who were found illegal... pic.twitter.com/CqYhV6FnRi

    — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:
Drugs in Hyderabad: నగరంలో మరోసారి గుప్పుమన్న డ్రగ్స్‌.. 10 కోట్ల విలువైన సరకు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.