ETV Bharat / crime

AR Constable Suicide : నిశ్చితార్థానికి ముందు కానిస్టేబుల్ ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

AR Constable Suicide, Constable Ashok Kumar commits suicide
నిశ్చితార్థానికి ముందు కానిస్టేబుల్ ఆత్మహత్య
author img

By

Published : Jan 10, 2022, 1:12 PM IST

Updated : Jan 10, 2022, 6:14 PM IST

13:09 January 10

లాడ్జిలో ఉరేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ అశోక్‌కుమార్ ఆత్మహత్య

AR Constable Suicide : తెల్లారితే నిశ్చితార్థం. విధులకు వెళ్లిన కుమారుడు ఉదయాన్నే వస్తానని చెప్పాడు. ఇక బంధువులందరూ ఇల్లు చేరారు. తెల్లారితే తమ కొడుకు నిశ్చితార్థ వేడుకను వైభవంగా జరపాలనకున్నారు. వచ్చిన వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని తాపత్రయపడ్డారు. కానీ విధికి వారిని చూసి కన్నుకుట్టింది. అప్పటిదాకా సంబురంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా ఆర్తనాదాలు ఘొల్లుమన్నాయి. కొడుకు నిశ్చితార్థ వేడుకను వైభవంగా జరపాలనుకున్న ఆ తల్లిదండ్రులు... తమ కుమారుడిని మరణశయ్యపై చూడాల్సి వచ్చింది.

ములుగు జిల్లాకు బదిలీ చేశారని మనస్తాపానికి గురై ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కంచపోగు అశోక్ కుమార్... 2020 బ్యాచ్​కు చెందిన ఉద్యోగి. ములుగు ప్రాంతంలో కానిస్టేబుల్​గా విధులు నిర్వహించేవారు. ఇటీవల కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయింది.

బదిలీ అయ్యాక కూడా... ములుగులోనే విధులు నిర్వర్తించాలని ఉన్నతాధికారులు చెప్పడంతో అశోక్ కుమార్ మనస్తాపానికి గురయ్యారని ఆయన తండ్రి చెప్పారు. ఈ నెల 8న ఖమ్మం వచ్చిన అశోక్... నగరంలోని ఓ హోటల్లో రాత్రి బసచేశారు. ఉదయం ఎంతకూ గది తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తీసి చూడగా అశోక్ కుమార్ ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అశోక్ కుమార్​కు సోమవారం నాడు వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. తెల్లారితే ఎంగేజ్​మెంట్ అనగా... కొడుకు చనిపోవడంతో ఆయన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. నిశ్చాతార్థ వేడుక కోసం ఇంటికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మా కొడుకు ములుగులో చేస్తున్నాడు. ఈమధ్యే కొత్తగూడెంకు బదిలీ అయ్యాడు. కానీ ఇంకా ఆరు నెలలు ములుగులోనే చేయాలని అధికారులు అన్నారని మాతో చెప్పాడు. అందుకు చాలా బాధపడ్డాడు. ఈ మధ్యే పెళ్లి కూడా కుదిరింది. ఇవాళే ఎంగేజ్​మెంట్ జరగాల్సి ఉంది. రాత్రికి హోటల్​కు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాకు తెలియడం లేదు. దీనికి కారణాలు ఏంటో తెలుసుకొని మాకు న్యాయం చేయాలి.

-వెంకటేశ్వర్లు, మృతుడి తండ్రి

ఇదీ చదవండి: ఏపీలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య కేసు.. సెల్ఫీ వీడియో బహిర్గతం

Last Updated : Jan 10, 2022, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.