ETV Bharat / crime

మృత్యువాతపడిన 3 క్వింటాళ్ల చేపలు.. - 3 quintals of fish die in thummalacheruvu pond latest news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట తుమ్మలచెరువులో సుమారు 3 క్వింటాళ్ల చేపలు మృత్యువాతపడ్డాయి. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

3 క్వింటాళ్ల చేపలు మృతి
3 క్వింటాళ్ల చేపలు మృతి
author img

By

Published : May 9, 2021, 7:59 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట కాకతీయుల ప్రసిద్ధ తుమ్మలచెరువులో సుమారు మూడు క్వింటాళ్ల చేపలు మృత్యువాతపడ్డాయి. మృతి చెందిన చేపలను తుమ్మల చెరువు వద్ద పలు ప్రదేశాల్లో పారేశారు.

నెల్లిపాక మధ్య సహకార సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల చేప పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 7.80 లక్షల చేప పిల్లలు మొత్తం 9.80 లక్షల చేప పిల్లలను చెరువులో వేశారు. చేపలు ఎదగడంతో గత నెల నుంచి విక్రయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శనివారం చేపలను పట్టారు. వాటిల్లో కొన్నింటిని విక్రయించి.. మిగిలిన సుమారు 3 క్వింటాళ్ల చేపలను ఒక వల చిక్కంలో పెట్టి చెరువులో ఉంచారు.

ఆదివారం చేపలను విక్రయించేందుకని చూడగా.. అన్నీ మృత్యువాతపడ్డాయి. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు అడుగు భాగంలో బురద వేడి వల్ల చేపలు మృతి చెంది ఉంటాయని పలువురు భావిస్తున్నారు.

ఇదీ చూడండి.. శనగ రైతు ఆవేదన: పంట కొన్నారు.. పైసలివ్వడం మరిచారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.