నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడైన మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్‌ను కౌన్సిలర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ.. జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ ఫారుఖీ ఉత్తర్వులు జారీచేశారు. సాజిద్‌పై ఇప్పటికే అపహరణ, అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా రౌడీషీట్ సైతం తెరిచారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన పాలనాధికారి తనకున్న విస్తృత అధికారాలతో నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం పదవి నుంచి తొలగించారు. ఉత్తర్వులు జారీ అయినప్పటి నుంచి ఈ సస్పెన్షన్ వర్తించటంతో.. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని సైతం కోల్పోయినట్టైంది.
మరో ముగ్గు రిమాండ్..
ఆ కేసులో ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండకు తరలించిన పోలీసులు.. తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో షేక్ సాజిద్ ప్రధాన నిందితుడని తెలిసినా.. పారిపోయేందుకు కారు ఏర్పాటుచేసిన అబ్దుల్ సమద్, ఆదిలాబాద్‌కు చెందిన డ్రైవర్ షేక్ సాజిద్, ఇంట్లో ఆశ్రయం కల్పించిన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాకు చెందిన కాసం రంజాన్ నిన్సూర్ వాలె అనే కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలిచినట్టు డీఎస్సీ ఉపేంద్రారెడ్డి తెలిపారు. నేరాలతో సంబంధం ఉన్నవారికి ఎవరు ఆశ్రయం కల్పించినా.. దాచినా.. ధన, వస్తు, వాహన రూపంలో సాయం అందించినా చట్టరీత్యా శిక్షార్హులవుతారని హెచ్చరించారు.
ఇదీ చూడండి: