ETV Bharat / crime

LOAN APPS: సైబర్‌ పోలీసునంటూ రూ.1.18 కోట్లు స్వాహా - another cyber cryme

రుణ యాప్‌ కేసులో వెలుగులోకి మరో మోసం
రుణ యాప్‌ కేసులో వెలుగులోకి మరో మోసం
author img

By

Published : Jun 1, 2021, 8:16 AM IST

Updated : Jun 1, 2021, 9:10 AM IST

08:14 June 01

రుణ యాప్‌ కేసులో వెలుగులోకి మరో మోసం

రుణయాప్​ల కేసులో మరో కొత్తం మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసుల పేరిట లేఖ ఇచ్చి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఓ కార్పొరేట్‌ బ్యాంకులోని ఖాతాల నుంచి రూ.1.18 కోట్లు ఊడ్చేశారు సైబర్‌ మాయగాళ్లు.

కొంత కాలం క్రితం హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో నమోదైన ఓ కేసులో కోల్‌కతా, గుర్‌గావ్‌లలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న నిందితుల ఖాతాల లావాదేవీలను పోలీసులు స్తంభింపజేశారు. ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లి తనకు తాను కోల్‌కతా సైబర్‌ ఎస్సైనంటూ పరిచయం చేసుకొని, నకిలీ గుర్తింపు కార్డునిచ్చాడు. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు స్తంభింపజేసిన ఖాతాను పునర్ధురించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు పంపించారంటూ ఓ ప్రతిని బ్యాంకు అధికారులకు అందజేశాడు. గుర్‌గావ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లోనూ అదే సమయంలో ఇలాంటి నకిలీ పత్రాలనే సమర్పించారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాను మనుగడలోకి తెచ్చారు.

రూ.1.18 కోట్లు బదిలీ..

కొద్ది క్షణాల్లోనే రెండు ఖాతాల్లోని మొత్తం రూ.1.18 కోట్లు బదిలీ అయ్యాయి. ఇదంతా వెంటనే జరిగిపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు విచారణ చేస్తే.. ఉత్తర్వుల ప్రతులన్నీ నకిలీవని తేలింది. వెంటనే హైదరాబాద్‌లోని బ్యాంకు అధికారులకు సమాచారాన్ని అందించగా.. కేసు నమోదు చేయించారు.

ఇప్పటికే 28 మంది అరెస్ట్​.. 

తక్కువ వడ్డీ పేరుతో వేల కోట్ల రూపాయల రుణాలిచ్చి పలువురి ఆత్మహత్యలకు కారణమైన రుణ యాప్​ల నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 28 మందిని అరెస్టు చేసి నిర్వాహకులకు చెందిన బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. హైదరాబాద్, బెంగళూర్, కోలకతా, దిల్లీలోని పలు ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.400 కోట్లను నిలిపివేశారు. బ్యాంకుల్లో ఉన్న డబ్బును ఎలాగైనా వాడుకోవాలని రుణ యాప్ నిర్వాహకులు ఈ తరహా మోసాలకు తెరలేపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఇదీ చూడండి: Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ

Last Updated : Jun 1, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.