కరోనా మహమ్మారి సృష్టించిన దుర్భిక్షానికి... నల్గొండ జిల్లా నాగర్జునసాగర్ హిల్‌కాలనీలో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు తనువు చాలించాడు. పెద్దవూర మండలం కేంద్రంలోని డివైన్ మెర్సీ పాఠశాలలో రవి(30) ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. కరోనా కారణంగా... పాఠశాలలు తెరుచుకోకపోవటం, యాజమాన్యం జీతాలు ఇవ్వకపోవటం వల్ల రవి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి.
కుటుంబం గడవక భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అవి కాస్తా.. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయే స్థాయికి పెరిగిపోయాయి. ఈ బాధలతో తీవ్ర మనస్తాపానికి గురైన రవి ధైర్యం కోల్పోయి... మరణమే శరణ్యమనుకున్నాడు. భరించలేని బాధలతో బలహీన క్షణాల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మరణంతో ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.