ETV Bharat / crime

బాలికపై తోటి విద్యార్థి అఘాయిత్యం.. వీడియో తీసి బ్లాక్​మెయిల్​ చేస్తూ పలుమార్లు! - జూబ్లీహిల్స్​ మైనర్​ బాలికపై అత్యాచారం

Minor Rape Case: హైదరాబాద్​లో మైనర్లపై అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. జూబ్లీహిల్స్​ ఘటనతో మొదలైన అఘాయిత్యాలు.. ఒకదాని తర్వాత ఇంకోటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఇంటర్మీడియట్​ చదువుతోన్న విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారం చేయటమే కాకుండా.. అది వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

another minor girl rape incident in badangpet

author img

By

Published : Jun 10, 2022, 8:44 PM IST

Minor Rape Case: జూబ్లీహిల్స్​లో మైనర్​ బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత నుంచి అలాంటి ఘటనలు ఒకటి తర్వత మరొకటి.. రోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. అన్నింట్లలో బాధితులు మైనర్లే కావటం.. ఆలస్యంగా బయటకు వస్తుండటం గమనార్హం. తాజాగా.. మీర్​పేట పోలీస్​స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట్​లోనూ అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల విద్యార్థినిపై.. నల్లకుంటకు చెందిన అమిత్ వర్ధన్(19) అనే సహచర విద్యార్థి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.

బడంగ్​పేట్​కు చెందిన అమ్మాయి కాచిగూడలోని ఓ జూనియర్​​ కళాశాలలో ఇంటర్మీడియట్​ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న సహచర విద్యార్థి అమిత్​వర్దన్​.. అమ్మాయితో గతేడాది పరిచయం ఏర్పర్చుకున్నాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లిచేసుకుంటానని.. కొన్ని రోజులు వెంటపడ్డాడు. బాలిక నంబర్​ తీసుకుని తరుచూ ఫోన్​ చేస్తూ.. తన ప్రపోజల్​ను అంగీకరించమని కోరేవాడు. అతడి మాటలను నమ్మిన అమ్మాయి.. చివరికి 2022 జనవరిలో వర్ధన్​ ప్రేమను అంగీకరించింది. ఆ రోజు నుంచి ఇద్దరు ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవాళ్లు.

వీళ్ల ప్రేమాయణం ఇలా సాగిపోతుండగా.. ఫిబ్రవరిలో ఓ రోజు ఉన్నట్టుండి అమ్మాయి వాళ్ల ఇంటికి వర్ధన్​ వెళ్లాడు. ఏవేవో మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. బలవంతంగా ఆమెను లోబర్చుకుని కోరిక తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా.. వాళ్లు ఏకంతంగా గడిపిన దృశ్యాలను అమ్మాయికి తెలియకుండా తన మొబైల్​లో రికార్డు చేశాడు. ఇక అప్పటి నుంచి తన నిజస్వరూపం బయటపెట్టాడు. రికార్డు చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. వీడియోను సోషల్​మీడియాలో వైరల్​ చేస్తానని బెదిరించాడు. అతడి బెదిరింపులు భరించలేక.. బాధితురాలు మీర్​పేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు నిందితుడు అమిత్​ వర్ధన్​ను అరెస్టు చేసి.. విచారిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.