shilpa chowdary fraud case: ఘారానా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి మాయలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. ఆసక్తి చూపించిన వారి నుంచి కోట్లలో డబ్బులు రాబట్టిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. కోటీ ఐదు లక్షలు మోసం చేసిందని దివ్య అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బయటపడిన శిల్పాచౌదరి మోసాల చిట్టా.. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే శిల్పపై మూడు కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఇంకొకరు ఫిర్యాదు చేశారు.
shilpa chowdary hyderabad: తన వద్ద రెండు కోట్ల తొంభై లక్షలు తీసుకుని మోసం చేసిందని మరో మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిట్టీ పార్టీల పేరిట శిల్ప తనకు పరిచయమైందని.. అధిక వడ్డీల ఆశ చూసి 2.9 కోట్ల రూపాయలు తీసుకుందని బాధితురాలు పేర్కొంది. శిల్పపై కేవలం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లోనే ఇప్పటికి మూడు కేసులు నమోదు కాగా.. ఇది నాలుగోది.
shilpa chowdary cheating case: నార్సింగ్ పరిధిలో చిట్టీలపేరుతో పలువురిని మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. శిల్ప, శ్రీనివాస్ ప్రసాద్ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రియల్ ఎస్టేట్, సినిమాల్లో పెట్టుబడి పేరుతో బాధితుల నుంచి శిల్పాచౌదరి డబ్బులు వసూలు చేసేవారు. శిల్పాచౌదరి సహేరి అనే సినిమా తీసింది. శిల్పాపై పలువురు బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆమె వల్ల మోసపోయిన బాధితులెవరైనా నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ప్రముఖులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. శిల్ప చేస్తున్న మోసాలు భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు తెలుసని.. ఇద్దరిపై ఛీటింగ్ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
shilpa chowdary producer: శిల్పా చౌదరి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని కోట్లలో మోసాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. వచ్చిన డబ్బుతో ఇద్దరు కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు. అధిక వడ్డీ ఇస్తానని, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి.. మోసాలకు పాల్పడేవారని డీసీపీ తెలిపారు. బాధితులను ఆకర్షించేందుకు పేజ్ త్రీ పార్టీలు ఇచ్చి కోట్లలో కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే శిల్పాచౌదరి దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. మరిన్ని బ్యాంకు ఖాతాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట శిల్ప వసూలు చేసిన కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించదనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో వైపు ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సంబంధిత కథనాలు..