ETV Bharat / crime

బస్సు బోల్తా ఒకరు మృతి... 30 మందికి గాయాలు - బస్సు బోల్తా ఒకరు మృతి 30 మందికి గాయాలు

ఏపీలోని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు.

బస్సు బోల్తా ఒకరు మృతి... 30 మందికి గాయాలు

author img

By

Published : Mar 11, 2021, 9:10 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్​ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బీమా సొమ్ము కోసం మామను హత్య చేసిన అల్లుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.