మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ సర్పంచి సహాయంతో శవాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, చీకటి పడటంతో ఆ ప్రయత్నాన్ని మానుకుని వెనుదిరిగారు.
వరదలో కొట్టుకువచ్చిన మృతదేహం కల్వర్టులో చిక్కుకుంది. శవాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలుకాలేదు. చీకటి పడడంతో పనికి ఆటంకం కలిగిందని పోలీసులు తెలిపారు. రేపు ఉదయం మళ్లీ ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: వీరవాసరం పీఎస్లో నగదు మాయం చేసిన ఇంటి దొంగలు అరెస్ట్