ETV Bharat / crime

అమ్మ లేదని.. ఇక తిరిగిరాదని.. తెలియని ఓ పసిప్రాయం

సరిగా మాటలు కూడా రాని వయసు. తల్లి రోజూలాగే ఎందుకు నిద్ర లేవలేదో తెలియని పసిమనసు. ఆమె మేలుకొంటుందని బేలగా ఎదురుచూపులు. అభం శుభం ఎరుగని చిన్నారికేం తెలుసు? తల్లి ప్రాణం గాలిలో కలిసిపోయిందని... అమ్మ ప్రేమ తనకు దూరమైందని... హృదయ విదారకమైన ఈ దృశ్యం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కనిపించింది.

అమ్మ లేదని.. ఇక తిరిగిరాదని.. తెలియని ఓ పసిప్రాయం
అమ్మ లేదని.. ఇక తిరిగిరాదని.. తెలియని ఓ పసిప్రాయం
author img

By

Published : Mar 3, 2021, 8:46 AM IST

సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. కొత్త బస్టాండ్ సమీపంలో ఓ మహిళ అకస్మాత్తుగా చనిపోయింది. స్థానిక కొత్తబస్టాండు ప్రాంతంలో ఓ మహిళ (20) మూడు రోజులుగా భిక్షాటన చేసుకుంటూ నాలుగేళ్ల తన కుమార్తెతో కలిసి జీవిస్తోంది.

మంగళవారం ఉదయం ఆ మహిళ రోడ్డు పక్కన మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తెలిపారు. చిన్నారిని సూర్యాపేట జిల్లా సఖీ కేంద్రంలో అప్పగించారు.

ఇదీ చూడండి: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.