యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులోని వంతెన కింద ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పెద్దవాగు వంతెన కింద గోనె సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నర్సింహరెడ్డి ఘటనా స్థలిని పర్యవేక్షించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని, కుడిచేతిపై యాదమ్మ అని పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో విచారిస్తున్నట్లు వెల్లడించారు.
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం వల్ల నాలుగైదు రోజుల క్రితమే చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళ గురించి తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చూడండి: టిప్పర్ ఢీకొని.. హైదరాబాద్లో నేపాల్ దంపతుల దుర్మరణం