కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయంలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభించింది. సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండి గోధుమ రంగు చొక్క, నీలిరంగు జీన్స్ పాయింటు వేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఆచూకీ తెలిసిన వారు నాగిరెడ్డిపేట స్టేషన్‌లో సంప్రదించాల్సిందిగా ఎస్సై రాజయ్య తెలిపారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: పోలీసుల మానవత్వం... మతిస్థిమితం లేని యువకునికి ఆశ్రయం