విశాఖ విమానాశ్రయంలో (Visakhapatnam Airport) మంగళవారం... టి.సుజాత అనే వృద్ధురాలు నుంచి 13 రౌండ్ల బుల్లెట్లను (Pistol Bullets) సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే వయస్సు రీత్యా ఆమెకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
బుల్లెట్లు ఎలా వచ్చాయంటే....
విశాఖ ఆర్‌కే బీచ్ సమీపంలో నివాసముంటున్న తిపురాని సుజాత(73) హైదరాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఇండిగో విమానం టికెట్ తీసుకున్నారు. ఈక్రమంలో ఆమె బ్యాగ్ తనిఖీ చేసిన సీఐఎస్‌ఎఫ్ అధికారులు 13 బుల్లెట్లను గుర్తించి ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలి పెదనాన్న హంటింగ్ (Hunting) చేసే వారని, అప్పట్లో ఆయనకు తుఫాకీ లైసెన్సు కూడా ఉండేదని ఆమె పోలీసులకు తెలిపింది. ఆయన 1999లో మరణించాడని ఆయన బ్యాగ్‌లో దుస్తులు పెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు తెలిపారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్టు తాను గుర్తించలేదని ఆమె చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: TELUGU AKADEMI FD SCAM : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో ఎవరి వాటా ఎంతంటే..?