ETV Bharat / crime

ఆత్మహత్యకు యత్నించిన మతిస్థిమితం లేని వ్యక్తి - మతి స్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మతిస్థిమితంలేని ఓ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న పరిహారం తనకు అందలేదని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సికింద్రాబాద్​ పరిధిలోని తిరుమలగిరి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడికి చికిత్స అందించి ఇంటికి పంపించారు.

a man sucide attempt in front of tirumalagiri tahsildar office
మతి స్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 26, 2021, 2:48 AM IST

Updated : Mar 26, 2021, 4:08 AM IST

మానసిక పరిస్థితి సరిగాలేని ఓ వ్యక్తి ప్రభుత్వం వరద బాధితులకు ఇచ్చిన రూ. 10 వేలు తనకు అందలేదని చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగింది.

సికింద్రాబాద్​లోని హస్మత్ పేట్ అంజయ్య నగర్ బస్తీకి చెందిన మల్లేశ్ గురువారం మధ్యాహ్నం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఇచ్చిన రూ. 10 వేలు తనకు అందలేదని ఆరోపిస్తూ.. చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు . గమనించిన తహసీల్దార్ మాధవి రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడికి ప్రాథమిక చికిత్స చేయించారు . ఈ విషయం తెలుసుకున్న బస్తీ పెద్దలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మల్లేశ్​ మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడంతో అతడికి చికిత్స అందించి వారితో పంపించారు. తహసీల్దార్​ కార్యాలయం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడం వల్ల కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: తక్కువ ధరకే కారు అంటారు.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తారు

Last Updated : Mar 26, 2021, 4:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.