ETV Bharat / crime

ప్రజాప్రతినిధి భర్త పాడుపని.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓవ్యక్తి కిడ్నాప్ - Kidnapping rampage in Sangareddy district

ఆయన ఓ ప్రజాపతినిధి భర్త. అందరికి మంచి చెప్పాల్సిన తానే అన్యాయానికి పాల్పడ్డాడు. తన బంధువుల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళ భర్తను కిడ్నాప్ చేశాడు. ఈఘటన సంగారెడ్డి జిల్లాలో 15రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Aminpur
Aminpur
author img

By

Published : Sep 28, 2022, 4:28 PM IST

Updated : Sep 28, 2022, 6:45 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయిచడం కలకలం సృష్టించింది. 15రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. అమీన్​పూర్​ మున్సిపాలిటీ చెందిన ఓ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి తన బంధువులకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈవిషయాన్ని గమనించిన సదరు మహిళ భర్త రాజు వారి బాగోతాన్ని వీడియోలు తీశాడు. ఈవిషయం తెలుసుకున్న శిఖామణి తన అనుచరులను పంపించి రాజును కిడ్నాప్ చేయించాడు. అతని వద్ద ఉన్న వీడియోలను తీసివేయించి రాజును విడిచిపెట్టారు. ఈఘటన 15రోజల క్రితం జరగగా బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమీన్​పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలో ఏడుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురి నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సెల్​ఫోన్​లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు. సదరు బాధితుడు రాజుపై అతని భార్య గతంలో ఖమ్మంలో కేసు పెట్టినట్లు సమాచారం.

ఇవీ చదవండి: మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వరరావుకు హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్

విడాకులు అడిగిందని నడిరోడ్డుపై హత్య.. ప్రేయసిపై కోపంతో విషం తాగి ఆత్మహత్య

Last Updated : Sep 28, 2022, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.