ETV Bharat / crime

Venkatesh's funeral: ఆందోళనల మధ్య పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌ అంత్యక్రియలు

Panchayat Secretary Venkatesh's funeral: మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురం పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్‌ అంత్యక్రియలు ఆందోళనల మధ్య ముగిశాయి. మృతుని భార్యకు ఒప్పంద విధానంలో ఉద్యోగం ఇస్తామనే హామీ లేఖను అందించినప్పటికీ కొన్ని సంఘాల వారు అంగీకరించలేదు. దీంతో పోలీసులకు, సంఘాల నేతలు, కార్యదర్శులకు మధ్య వాగ్వాదం జరిగింది.

Panchayat Secretary Venkatesh's funeral
Panchayat Secretary Venkatesh's funeral
author img

By

Published : Feb 8, 2022, 5:12 AM IST

Panchayat Secretary Venkatesh suicide updates: ఆత్మహత్యకు యత్నించి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్‌ అంత్యక్రియలు ఆందోళనల మధ్య ముగిశాయి. మృతదేహాన్ని అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామం పాత ఇర్సులాపురానికి చేర్చారు.

సోమవారం ఉదయం సీఐ తిరుపతి మృతుని భార్య సుభద్రను కలెక్టర్‌ శశాంక వద్దకు తీసుకెళ్లి ఆమెకు ఉద్యోగం ఇచ్చేలా హామీ తీసుకొని తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అంత్యక్రియలకు(Venkatesh's funeral) ఏర్పాట్లు చేస్తుండగా వివిధ జిల్లాల నుంచి అక్కడికి చేరుకున్న పంచాయతీ కార్యదర్శులు, జాక్టో, టీపీఎస్‌జేఏసీ(TPSJAC) సహా వివిధ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అధికారులు ఇప్పటివరకు మౌఖికంగా 32 మంది కార్యదర్శుల కుటుంబాలకు హామీ ఇచ్చినా న్యాయం జరగలేదని, లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెగేసి చెప్పారు. అక్కడే బైఠాయించారు. డీపీవో సాయిబాబా, ఆర్డీవో కొమరయ్య తదితరులు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది.

పరిస్థితిని కలెక్టర్‌కు వివరించిన అధికారులు సుభద్రకు ఒప్పంద విధానంలో ఉద్యోగం ఇస్తామనే హామీ లేఖను అందించినప్పటికీ కొన్ని సంఘాల వారు అంగీకరించలేదు. వెంటనే నియామక ఉత్వరులు ఇవ్వాలని, పరిహారం కూడా ఇప్పుడే అందించాలనే డిమాండ్లతో ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, సంఘాల నేతలు, కార్యదర్శులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అక్కడున్న వారిని చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి రావడంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఇదీ జరిగింది:

‘అన్ని విషయాల్లో మమ్ములను బలిపశువులను చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులం. పంచాయతీకి పెట్టుబడి ఎక్కడి నుంచి తేగలం? ట్రాక్టర్‌కు డీజిల్‌ కూడా మేమే పోయించాలి. సర్పంచికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా..బానిస బతుకా సార్‌? కార్యదర్శుల పని తీరువల్లే అనేక విషయాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. అయినా మాకు గుర్తింపు లేదు. కష్టపడి ఉన్నత చదువులు చదివితే ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకుంటే చదువురాని కొందరి తీరుతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి’’ అని లేఖ రాసి ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు యత్నించారు.

పాత ఇర్సులాపురానికి చెందిన వెంకటేశ్‌ నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. సర్పంచి, ఉపసర్పంచి సహకరించడం లేదంటూ జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ పేరిట లేఖ రాసి శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్‌ శశాంక, బయ్యారం ఎంపీడీవో చలపతిరావు, మరికొందరు అధికారులు ఆసుపత్రిలో వెంకటేశ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేశ్‌ను హైదరాబాద్‌కు తరలించగా... చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

ఇదీ చూడండి: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం.. వారే కారణమంటూ లేఖ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.