ETV Bharat / crime

పాతబస్తీలో పట్టపగలే దారుణం.. కార్పొరేటర్​ మేనల్లుడి దారుణ హత్య - Nephew of Lalitabagh corporator was killed

AIMIM Corporator Nephew Murder : పట్టపగలే కార్పొరేటర్ కార్యాలయంలోకి చొరబడి ఆయన మేనల్లుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన హైదరాబాద్​ పాతబస్తీలోని లలిత్​ బాగ్​లో జరిగింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

AIMIM corporator nephew of the murdered has died
కార్పొరేటర్​ మేనల్లుడు హత్య
author img

By

Published : Dec 19, 2022, 9:31 PM IST

Updated : Dec 19, 2022, 9:43 PM IST

AIMIM Corporator Nephew Murder : హైదరాబాద్​ పాతబస్తీలోని లలిత్​ బాగ్​ కార్పొరేటర్​ మేనల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. భవానీనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఈద్ బజార్​ ప్రాంతంలో ఉన్న లలిత్ బాగ్​ కార్పొరేటర్​ ఆజం షరీఫ్​ కార్యాలయంలోకి గుర్తు తెలియని దుండగులు కత్తులతో దూరారు. ఆయన​ మేనల్లుడు మూర్తుజా అనస్​పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న బాధితుడిని వెంటనే కంచన్‌బాగ్​లో ఉన్న ఒవైసీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 19, 2022, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.