ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా చోడవరం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో బాధితురాలు జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. అదే కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వరరావు కొంత కాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఏఈ అసభ్యకర చర్యలకు విసుగు చెందిన ఆమె.. తన భర్తకు, యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కార్యాలయంలోనే అందరూ కలిసి ఏఈని నిలదీశారు. కోపోద్రిక్తురాలైన బాధితురాలు వారి సమక్షంలోనే అతనికి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: Cyberabad CP: 'బ్యాంకు అధికారులమని.. రూ.3కోట్లు దోచేశారు''