కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్వోటీ పోలీసులు కల్తీ పాలను తయారు చేసి హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు ప్రతి నిత్యం వేలాది లీటర్లను సరఫరా చేస్తున్న వారిని పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు. భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం నుంచి తెల్లవారుజామున వాహనాల్లో హైదరాబాద్‌కు కల్తీ పాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, పాల తయారీకి ఉపయోగించే కెమికల్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్వోటీ పోలీసులు భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: