ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఓ కారు పూర్తిగా దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చెక్కలొని గూడెంలో జరిగింది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
మండలంలోని వనంపల్లి గ్రామానికి చెందిన జంగయ్య ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. గాయపడిన జంగయ్య.. కారులోంచి ఒక్కసారిగా మంటలు రావడంతో సృహ తప్పి కింద పడిపోయడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రున్ని 108 వాహనంలో షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో ఎవరూ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారు ఎవరిది? అక్కడ ఎవరు వదిలారు? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్ దక్కదు: రఘునందన్