ETV Bharat / crime

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్​కు ప్రమాదం.. - minister errabelli accident news

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు పెను ప్రమాదం తప్పింది. మంత్రి తన కాన్వాయ్​లో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తోన్న ట్రాక్టర్​ నుంచి ఓ కేజివిల్ చక్రం ఊడి మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్​కు ప్రమాదం..
మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్​కు ప్రమాదం..
author img

By

Published : Aug 6, 2021, 7:11 PM IST

పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు పెను ప్రమాదం తప్పింది. జనగామ జిల్లా తొర్రూరు నుంచి జనగామకు కాన్వాయ్​లో వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​లోంచి కేజివీల్ ఊడిపోయింది. ఒక్కసారిగా చక్రం కాన్వాయ్​లోని మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.

స్వల్పంగా దెబ్బతిన్న వాహనం
స్వల్పంగా దెబ్బతిన్న వాహనం

వెలిశాల వద్ద జరిగిన ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడగా.. బుల్లెట్​ ప్రూఫ్​ వాహనం డోర్​ స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదంలో మంత్రితో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చూడండి: కన్నతల్లి కర్కశం... ఇద్దరు పిల్లల గొంతునులిమి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.